బకాయిలు మాఫీ చేయాలి
eenadu telugu news
Published : 24/07/2021 06:34 IST

బకాయిలు మాఫీ చేయాలి


బ్యాంకు ఛైర్మన్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత, నదీమ్‌ అహ్మద్‌

తపోవనం(అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.లిఖితను శుక్రవారం పలువురు అభినందించారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌, పలువురు కార్పొరేటర్లు, నాయకులు అభినందించారు. పాత బకాయిలు రావాలంటే వడ్డీ పూర్తిగా మాఫీ చేయాలని, చేనేత సంఘాల రుణాల మాఫీకి సంబంధించి ప్రభుత్వంతో చర్చిస్తామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, నాయకుల శంకర్‌, వేణుగోపాల్‌, గోపాల్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని