ఆసుపత్రిలో వసతులపై ఆరా
eenadu telugu news
Published : 24/07/2021 06:18 IST

ఆసుపత్రిలో వసతులపై ఆరా

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: కరోనా మూడో వేవ్‌ నేపథ్యంలో ఇప్పటి నుంచే అన్ని విధాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య పర్యవేక్షకుడు డాక్టర్‌ జగన్నాథ్‌ పేర్కొన్నారు. ఆర్‌ఎంఓ డాక్టర్‌ విశ్వనాథయ్య, చిన్నపిల్లల విభాగం ఇన్‌ఛార్జి ప్రొఫెసర్‌ సర్దార్‌ సుల్తానా, నర్సింగ్‌ పర్యవేక్షకురాలు పుష్పలత, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మన్నతో కలిసి శుక్రవారం ఆయన చిన్నపిల్లల విభాగాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో వసతులు, సమస్యలపై ఆరా తీశారు. ఇప్పటి దాకా ఎన్ని పడకలు ఉన్నాయి. వైద్య యంత్రాలు ఏమేమి ఉన్నాయి. వెంటిలేటర్లు, ఎక్స్‌రే ప్లాంట్‌.. వంటి వాటి గురించి తెలుసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని