సోమలదొడ్డిని హరిత గ్రామంగా తీర్చిదిద్దాలి
eenadu telugu news
Published : 24/07/2021 06:18 IST

సోమలదొడ్డిని హరిత గ్రామంగా తీర్చిదిద్దాలి


మొక్క నాటుతున్న అధికారులు

 

అనంత గ్రామీణం(సోమలదొడ్డి), న్యూస్‌టుడే: పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని శిక్షణ కలెక్టర్‌ సూర్యతేజ పేర్కొన్నారు. అనంతపురం గ్రామీణ మండలం సోమలదొడ్డి గ్రామంలో గ్రీన్‌ విలేజ్‌ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఏజీఎస్‌ రెడ్డి సేవాసంస్థ, అనంతపురం డిస్కవర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏజీఎస్‌ రెడ్డి సేవాసంస్థ పర్యావరణ పరిరక్షణ, ప్రాచీన కట్టడాలను మరమ్మతులు చేయించి మన సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి సందీప్‌ కృపాకర్‌, సేవాసంస్థ కార్యదర్శి అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి లింగేశ్వరి, ఆ సంస్థ అధ్యక్షురాలు ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని