స్వయం ఉపాధి దిశగా సాగాలి
eenadu telugu news
Published : 24/07/2021 06:18 IST

స్వయం ఉపాధి దిశగా సాగాలి


యోగ్యత పత్రాలు అందజేస్తున్న ఎల్‌డీసీఎం వెంకటరాజు

 

తపోవనం(అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి వైపు దృష్టి కేంద్రీకరించాలని నూతన ఎల్‌డీసీఎం వెంకటరాజు పిలుపునిచ్చారు. స్వయం ఉపాధిలో ఆర్థిక స్వావలంబన సాధించడమే కాకుండా మరో పదుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగడానికి అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రూడ్‌సెట్‌ సంస్థలో నెలరోజుల పాటు సౌందర్యంపై నిర్వహించిన శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు అనేక సూచనలు అందించారు. సంస్థ డైరెక్టర్‌ లోకనాథరెడ్డి మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రూడ్‌సెట్‌ సంస్థ అనేక కొత్త కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఈ నెల 26 నుంచి ప్రత్యేకంగా జర్దోసీ జరీ మగ్గంపై శిక్షణ ప్రారంభమవుతుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని