కాందిశీకులకు స్వయం ఉపాధి కల్పిస్తాం
eenadu telugu news
Published : 24/07/2021 06:18 IST

కాందిశీకులకు స్వయం ఉపాధి కల్పిస్తాం


కాందిశీకులతో మాట్లాడుతున్న పీఠాధిపతి

గుంతకల్లు, న్యూస్‌టుడే: ఆంధ్రా సహకార నూలుమిల్లు మూతపడటంతో ఉపాధి కోల్పోయిన శ్రీలంక కాందిశీకులకు తాము స్వయం ఉపాధి కల్పిస్తామని హంపి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విద్యారణ్యభారతి స్వామి అన్నారు. పీఠాధిపతి శుక్రవారం శ్రీలంక కాందిశీకుల కాలనీలో పర్యటించారు. మిల్లు మూతపడటంతో తమ జీవితాలు దుర్భరంగా మారాయని, జీవించడం చాలా కష్టంగా మారిందని వాపోయారు. వారి కష్టాలు విని స్వామీజీ చలించిపోయారు. కాందిశీకులకు తాము అండగా ఉంటామని చెప్పారు. కూలీలుగా కాకుండా యజమానులుగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన సామగ్రిని ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఆ నలుగురు సేవాసమితి అధ్యక్షుడు మంజులా వెంకటేష్‌, సభ్యులు పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని