పుట్టపర్తి అభివృద్ధికి నిధులివ్వండి
eenadu telugu news
Published : 24/07/2021 06:18 IST

పుట్టపర్తి అభివృద్ధికి నిధులివ్వండి


కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ మాధవ్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి

 

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కోరారు. శుక్రవారం దిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు. చిత్రావతి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, ఆధునిక సౌకర్యాలతో హోటళ్లు, గ్రంథాలయం, విశ్రాంతి గదులు, ధ్యాన మందిరం, యోగా కేంద్రం, బోటింగ్‌ సౌకర్యం, సత్యసాయి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో సత్యసాయి మహాసమాధి దర్శనార్థం వస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని