ఐక్య ఉద్యమాలతోనే హక్కుల సాధన
eenadu telugu news
Published : 24/07/2021 06:18 IST

ఐక్య ఉద్యమాలతోనే హక్కుల సాధన

ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసనలు


ప్రసంగిస్తున్న ఫ్యాప్టో రాష్ట్ర ఇన్‌ఛార్జి హృదయరాజు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపై నడిచి ఐక్యంగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఫ్యాప్టో రాష్ట్ర ఇన్‌ఛార్జి హృదయరాజు పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించలేదన్నారు. జిల్లాలోని అనంతపురం, ధర్మవరం, హిందూపురం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి, మడకశిర, రాయదుర్గం, గుత్తి, తాడిపత్రి, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాల ఉపాధ్యాయులు ఎనిమిది డిమాండ్ల సాధనకు శుక్రవారం నిరసన తెలిపారు. అనంతపురంలోని గడియార స్తంభం సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే అనేక సార్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారంపై చొరవ చూపడం లేదన్నారు. దశల వారీగా పోరాటాలు చేసి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటామన్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలించరాదన్నారు. కొవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు గ్రీన్‌ చానల్‌ ద్వారా కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం ఉపాధ్యాయులు అనంతపురం డిప్యూటీ తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ సూర్యుడు, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు నరసింహులు, రమణయ్య, రమణారెడ్డి, కులశేఖర్‌రెడ్డి, జయరామిరెడ్డి, వెంకటరత్నం, పెద్దన్న, జేఏసీ ఛైర్మన్‌ అతావుల్లా పాల్గొన్నారు.

 

హాజరైన ఉపాధ్యాయులు

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని