మూడో దశ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
eenadu telugu news
Published : 24/07/2021 06:18 IST

మూడో దశ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌

జిల్లా పరిషత్తు: కొవిడ్‌-19 మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ తెలిపారు. జడ్పీ ఆవరణలోని సమావేశ మందిరంలో శుక్రవారం కొవిడ్‌-19 నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ‘గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మూడోవేవ్‌ను ఎదుర్కోవాలి. కొత్తగా ఎంపికైన నోడల్‌ అధికారులు అవగాహన పెంచుకోవాలి’ అని సూచించారు. ఆక్సిజన్‌ నిర్వహణ, కొవిడ్‌ పరీక్షలు, జ్వర సర్వే, ఆసుపత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌ల మేనేజ్‌మెంటు, హోం క్వారంటైన్‌, హోం ఐసోలేషన్‌ మేనేజ్‌మెంటు, కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌, కంటైన్‌మెంటు జోన్ల ఏర్పాటుపై చర్చించారు. కొత్తగా ఏర్పాటు చేసే ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకల సంఖ్య పెంచాలన్నారు. గ్రామ స్థాయిలో ఐసోలేషన్‌ కేంద్రాలకు భవనాలను గుర్తించాలన్నారు. సమావేశంలో జేసీలు సిరి, నిశాంతి, గంగాధర్‌గౌడ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ పాల్గొన్నారు.

ప్రతిపాదనలు సిద్ధం చేయండి

జిల్లా సచివాలయం: జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ.39 కోట్ల నిధులు ఉన్నాయి. అందుకు సంబంధించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో జేసీలు సిరి, గంగాధర్‌గౌడ్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ శాఖల వారీగా ఏయే పనులు అవసరముందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని