వైద్య పరిశోధనలకు ప్రాధాన్యం
eenadu telugu news
Published : 24/07/2021 06:18 IST

వైద్య పరిశోధనలకు ప్రాధాన్యం


ప్రిన్సిపల్‌తో సమావేశమైన షేర్‌ ఇండియా ప్రతినిధులు

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: బోధనా సిబ్బంది.. పీజీ డాక్టర్లు వైద్య పరిశోధనల దిశగా దృష్టిసారించాలి. తమ సంస్థ కూడా వీటికే అధిక ప్రాధాన్యం ఇస్తోందని షేర్‌ ఇండియా బృందం ప్రధాన ప్రతినిధి మహాలింగం పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రతినిధుల బృందం సభ్యులు మహాలింగం, లోకాభిరామ్‌, సాంకేతిక సలహాదారుడు సింహాచలం నాయుడు, శశిధర్‌రెడ్డి, వహీం తదితరులు శుక్రవారం వైద్య కళాశాలను సందర్శించారు. తొలుత కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య నీరజతో సమావేశం అయ్యారు. సూక్ష్మ జీవశాస్త్ర విభాగం (మైక్రోబయాలజీ) ల్యాబ్‌ల పనితీరు, పరిశోధనలు.. తదితర వాటిపై ఆరా తీశారు. పీజీ విద్యార్థులు, బోధనా సిబ్బంది పరిశోధనలు చేసేందుకు తగిన మౌలిక వసతులు, రుణ సదుపాయం కల్పించాలని కోరారు. రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థతో కలిసి షేర్‌ ఇండియా పని చేస్తోంది. మైక్రోబయాలజీ విభాగంలో కొవిడ్‌, సీడీ4, వైరల్‌ లోడ్‌ ల్యాబ్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో వైరల్‌ లోడ్‌ ల్యాబ్‌ అధికారి సాయిసుధీర్‌, ఏడీ సాయి గ్రేస్‌, వైద్యులు రవిప్రకాష్‌, వేముల సరోజ, శైలజ, చంద్రశేఖర్‌, ప్రవీణ, ప్రియాంక, పరదేశినాయుడు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని