19 నుంచి నీలకంఠేశ్వర ఆలయ ప్రారంభోత్సవ పూజలు
logo
Published : 12/06/2021 04:39 IST

19 నుంచి నీలకంఠేశ్వర ఆలయ ప్రారంభోత్సవ పూజలు

ప్రారంభోత్సవానికి సిద్ధంగా దేవాలయం

మడకశిర: మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నీలకంఠేశ్వరస్వామి ఆలయాల ప్రారంభోత్సవ పూజలు ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 19న మునీశ్వరస్వామి, అభయాంజనేయస్వామి ఆలయాల్లో గోపుర, కలశస్థాపన, 20న మునీశ్వరస్వామి, అభయాంజనేయస్వామి ప్రాణప్రతిష్ఠాపన, 21న నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో యాగశాల ప్రవేశం, హోమాలు, 22న నీలకంఠేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కొత్త, పాత ఆలయాల గోపురాలు, కలశస్థాపన, 23న నూతన విగ్రహాలు విజయగణపతి, బాలగణపతి, పంచముఖి ఆంజినేయస్వామి, రమా సహిత సత్యనారాయణస్వామి, సబ్రహ్మణ్యస్వామి, అయ్యప్పస్వామి, సాయిబాబా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని వివరించారు. అనంతరం నీలకంఠేశ్వరస్వామి, పార్వతీదేవి, లక్ష్మీనరసింహస్వామి, కోదండరంగస్వామి, లక్ష్మీరంగనాథస్వామి, వేణుగోపాలస్వామి, నవగ్రహాల జీర్ణోద్ధరణ, సరస్వతీదేవి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా డిజిటల్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం అందుబాటులో ఉంటుందని మాజీ మంత్రి పేర్కొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని