సెప్టిక్‌ ట్యాంకరులో కర్ణాటక మద్యం
logo
Published : 12/06/2021 04:39 IST

సెప్టిక్‌ ట్యాంకరులో కర్ణాటక మద్యం


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

మావటూరు(పెనుకొండ పట్టణం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో కర్ణాటక మద్యం అక్రమంగా తీసుకొచ్చి ఆంధ్రలో విక్రయించి సొమ్ముచేసుకొంటున్న కేటుగాళ్లు ఎక్కువయ్యారు. రకరకాల మార్గాల్లో కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. సెప్టిక్‌ ట్యాంకరులో కర్ణాటక మద్యం తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. శుక్రవారం పెనుకొండ డీఎస్పీ మహబూబ్‌ బాషా వివరాలను వెల్లడించారు. గురువారం రాత్రి పెనుకొండ ఎస్సై సిబ్బందితో కలసి మావటూరు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్ణాటకలోని పావగడ నుంచి వచ్చిన సెప్టిక్‌ట్యాంకులో 1,200 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు లభించాయి. పావగడకు చెందిన నవీన్‌కుమార్‌ సెప్టిక్‌ట్యాంకులో మద్యం రవాణా చేస్తే ఎవరికీ అనుమానం రాదని భావించి ఈ మార్గం ఎంచుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాసులు, నాగరాజు ముగ్గురిని అరెస్టు చేసి, వారివద్ద నుంచి 1200 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం, ఓ ద్విచక్రవాహనం, ఓ సెప్టిక్‌ట్యాంక్‌ సీజ్‌ చేశారు.

ద్విచక్రవాహనంలో 192 టెట్రాప్యాకెట్లు: ఈ తనిఖీల్లో పెనుకొండ మండలం మరువపల్లికి చెందిన బోయరామాంజి, బోయమూర్తి ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న 192 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం పట్టుబడింది. ఈఘటనలో ఓ ద్విచక్ర వాహనంతో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు.

మద్యం లభించిన వాహనం ఇదే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని