పింఛను సొమ్ముతో పేదల కడుపు నింపి..
logo
Published : 12/06/2021 04:39 IST

పింఛను సొమ్ముతో పేదల కడుపు నింపి..


భోజనం అందజేస్తున్న ఓబుల్‌రెడ్డి

సోమందేపల్లి : తన పింఛన్‌ సొమ్మును పేదల ఆకలి తీర్చడానికి వెచ్చించిన దివ్యాంగుని ఆదర్శం ఇది. కావేటినాగేపల్లికి చెందిన ఓబుల్‌రెడ్డి తన పింఛను సొమ్ము రూ. 3 వేలతో శుక్రవారం 40 మంది పేదలకు భోజనం అందించారు. కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో పేదల ఆకలి, ఇబ్బందులను గుర్తించారు. ప్రశాంతి దివ్యాంగుల మండల సమాఖ్య(వెలుగు) మాజీ కోశాధికారి ఓబుల్‌రెడ్డి కొన్నేళ్లుగా సోమందేపల్లిలో ఉంటున్నారు. ఈనెల ప్రభుత్వం అతనికి ఇచ్చిన పింఛను సొమ్ము రూ.3 వేలతో 40 భోజన పొట్లాలను హోటల్‌ నుంచి తెచ్చి గ్రామంలో తిరుగుతూ యాచకులు, అనాథలు, వృద్ధులకు అందజేశారు. పేదలను కొంతవరకైనా ఆదుకోవాలనే ఈ చిన్నసాయం అందించినట్లు ఓబుల్‌రెడ్డి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని