ఆధార్‌ అనుసంధానం.. సులభతరం
logo
Published : 12/06/2021 04:39 IST

ఆధార్‌ అనుసంధానం.. సులభతరం

పుట్టపర్తి గ్రామీణం : ఆధార్‌ కార్డుతో ఫోన్‌ నెంబరు అనుసంధానం కోసం ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఈ సమస్యలను గుర్తించిన తపాలా కార్యాలయం ఈ సేవలను మరింత చేరువ చేయడానికి చర్యలు చేపట్టింది. ఆయా తపాలా, ఉప తపాలా కార్యాలయాల్లో పోస్టుమాస్టర్లకు పరికరాలను సమకూర్చింది. హిందూపురం డివిజన్‌లో 14 తపాలా, ఉప తపాలా కార్యాలయాలకు వీటిని సమకూర్చారు. వీటి పరిధిలో కేవలం ఫోన్‌ నెంబరు అనుసంధానం మాత్రమే చేస్తారు. హిందూపురం సబ్‌ డివిజన్‌లో 3, కదిరి సబ్‌ డివిజన్‌లో 5, పెనుకొండ 1, మడకశిర 3, ధర్మవరం సబ్‌ డివిజన్‌లో రెండు తపాలా కార్యాలయాల్లో ఈ సేవలు అందనున్నాయి. బ్రాహ్మణపల్లి, గొట్లూరు, పిబీ.యడగేర, రేగాటిపల్లి, హిందూపురం ప్రధాన కార్యాలయంలో ఇద్దరికి, పులేరు, విట్టపల్లి, గంధోడివాండ్లపల్లి, కదిరి ఎల్‌ఎస్‌జీఎస్‌వో, నల్లమాడ, ఈతోడు, మడకశిర ఫలారం, వంకరకంట పోస్టాఫీస్‌లకు అవకాశం కల్పించామని పర్యవేక్షణాధికారి కళ్యాణ్‌రామ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని