కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయండి
logo
Published : 12/06/2021 04:39 IST

కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయండి


సమీక్షలో మాట్లాడుతున్న జేసీ నిశాంత్‌కుమార్‌

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: జులై 8న రైతు దినోత్సవం సందర్భంగా రైతు భరోసా కేంద్రానికొకటి చొప్పున ఉపకరణాల అద్దె (కస్టమ్‌ హైరింగ్‌) కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంయుక్త కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. యాంత్రీకరణ పథకంపై శుక్రవారం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో నిర్వహించిన సమీక్షలో జేసీ మాట్లాడుతూ.. జిల్లాలోని 854 రైతు భరోసా కేంద్రాల్లో అన్ని ఉపకరణాలు, యంత్రాలతో కలిగిన ఒక్కో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాకు తొలి విడత కింద 262 కేంద్రాలు మంజూరు అయ్యాయన్నారు. 40 శాతం రాయితీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, అందుకనుగుణంగా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో రైతు గ్రూపులు ఏర్పాటు చేశారు. రైతుల ఖాతా, ఆధార్‌ నెంబర్లు బ్యాంకర్లు తీసుకున్నారని, జులైలో తొలి విడత కింద మంజూరు చేసే గ్రూపులను గుర్తించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సమీక్షలో జేడీఏ రామకృష్ణ, డీడీఏ త్రినాథస్వామి, ఉద్యానశాఖ డీడీ సతీష్‌, ఆగ్రోస్‌ జిల్లా మేనేజర్‌ ఓబుళపతి, ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాధాకుమారి, ఏడీపీపీ విద్యావతి, సాంకేతిక వ్యవసాయాధికారులు సోమేశేఖర్‌ బాలానాయక్‌, ప్రతాప్‌, వంశీకృష్ణ, శంకర్‌లాల్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని