పట్టణాల శుభ్రతకు ప్రాధాన్యం
logo
Published : 12/06/2021 04:39 IST

పట్టణాల శుభ్రతకు ప్రాధాన్యం


అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీ నాగరాజు

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రథమ ప్రాధాన్యతగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం క్లీన్‌ ఆంధ్ర ప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకులు నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హిందూపురంలో పర్యటించారు. క్లాప్‌ కార్యక్రమ అమలుపై మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ వెంకటేశ్వరరావు, ఇంజినీర్‌ మల్లికార్జునప్ప, శానిటరీ అధికారులతో సమీక్ష జరిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల నుంచి తీసుకొచ్చిన చెత్తను ఉంచడానికి పట్టణం నాలుగు వైపులా నిర్మిస్తున్న చెత్త తరలింపు కేంద్రాల నిర్మాణ పనులను ఈ నెలఖారు కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా శ్రీకంఠాపురంలో నిర్వహిస్తున్న చెత్త సేకరణలో లోటు పాట్లను గుర్తించి సరి చేయాలని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన మార్కెట్‌ను, రూ.1.5 కోట్లతో నిర్మిస్తున్న శ్మశాన వాటికను, రూ.2.5 కోట్లతో నిర్మించే పట్టణ ఆరోగ్య కేంద్రాల పనులను పరిశీలించారు. కార్యక్రమాల్లో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఏసీపీ హరిదాస్‌, మున్సిపల్‌ డీఈ నీరజ, ఏఈలు నాగేంద్ర, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని