తల్లీబిడ్డలు.. తప్పని పడిగాపులు
logo
Published : 12/06/2021 04:39 IST

తల్లీబిడ్డలు.. తప్పని పడిగాపులు

వాహనం కోసం బాలింతలు, సహాయకుల ఎదురుచూపు

తొమ్మిది నెలలు బిడ్డను మోసి, ప్రసవ వేదనతో పునర్జన్మ పొందినంత కష్టం అమ్మది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు, బిడ్డలకు అవస్థలు తప్పడం లేదు. తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. కానీ ప్రస్తుతం వాటి కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో తల్లీబిడ్డను డిశ్ఛార్జి చేయడానికే మధ్యాహ్నం 12 గంటలవుతోంది. ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు అరకొరగా ఉండటంతో ఆసుపత్రి వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని, తల్లీబిడ్డలతో ఇళ్లకు చేరేవరకు రాత్రి అవుతోందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సొంత ఖర్చులతో ఇతర వాహనాల్లో వెళ్దామంటే.. కర్ఫ్యూ కారణంగా బస్సులు, ఇతర వాహనాలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో బాలింతలు, వారి సహాయకులు నిరీక్షించలేక నీరసించి పోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తల్లీబిడ్డ వాహనాలు తెప్పించే సరికి సమయం వృథా కావటంతో పాటు, ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. దీనికి తోడు మూడు నెలలుగా సిబ్బందికి జీతాలు అందక పోవటంతో వారు ఆవేదన చెందుతున్నారు. - చిత్రం: ఈనాడు, అనంతపురం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని