698 మందికి పాజిటివ్‌
logo
Published : 12/06/2021 04:39 IST

698 మందికి పాజిటివ్‌

ఐదుగురి మృతి

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా కొత్తగా మరో 698 మందికి కరోనా సోకింది. వీరిలో ఐదుగురు మృతి చెందారు. మొత్తం 6,795 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా.. 698 మందిలో కరోనా వైరస్‌ ఉన్నట్లు తేల్చారు. 10.22 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. కొత్త కేసులతో కలిపి బాధితుల సంఖ్య 1,48,677కు చేరింది. వీరిలో 1,44,739 మంది కోలుకున్నారు. 993 మంది మృత్యువాత పడ్డారు. 2,945 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీరిలోనూ 1,228 మంది ఆస్పత్రుల్లో, 1,516 మంది హోం ఐసోలేషన్‌, 201 మంది కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో ఉన్నారు. శుక్రవారం 578 మంది డిశ్ఛార్జి అయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని