జిల్లాకు 60 ఆహారశుద్ధి కేంద్రాలు
logo
Published : 12/06/2021 04:39 IST

జిల్లాకు 60 ఆహారశుద్ధి కేంద్రాలు

జిల్లా వ్యవసాయం: జిల్లాకు ఓడీఓపీ కింద కొత్తగా 60 చిన్న తరహా ఆహార శుద్ధి యూనిట్లు మంజూరు చేసినట్లు ఉద్యానశాఖ డీడీ సతీష్‌ తెలిపారు. ఈ పథకం కింద గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు రాయితీ ఇస్తామన్నారు. చిన్న తరహా ఆహార యూనిట్ల కింద వేరుసెనగ నూనె, వేరుసెనగ చిక్కి, మసాలా పీనట్స్‌, బటర్‌, పీనట్స్‌ కుకీస్‌ వంటి పరిశ్రమలు స్థాపించుకోవచ్చని ఆయన వివరించారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు, డ్వాక్రా మహిళలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల సభ్యులు ఆధార్‌, పాన్‌ బ్యాంకు ఖాతాల జిరాక్సు ప్రతులు అందజేయాలన్నారు. ఈ నెల 20తో గడువు ముగుస్తుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని