సోనూసూద్‌ సేవలు ప్రశంసనీయం
logo
Published : 12/06/2021 04:39 IST

సోనూసూద్‌ సేవలు ప్రశంసనీయం


వివరాలు వెల్లడిస్తున్న సంస్థ ప్రతినిధులు, డీఎస్పీ

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: ప్రముఖ నటుడు సోనూసూద్‌ అనంతపురం జిల్లా కేంద్రంలో ఆక్సిజన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అన్నారు. సోనూసూద్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సోనూసూద్‌ సంస్థ ర్యాపిడ్‌ ఆక్సిజన్‌ కేంద్రాన్ని అనంతలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీఐ జాకీర్‌హుసేన్‌, సోనూసూద్‌ సంస్థ ప్రతినిధులు అమిత్‌ పురోహిత్‌, శ్రీహరిరాజు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని