సమస్యలు పరిష్కరించాల్సిందే
logo
Published : 12/06/2021 04:39 IST

సమస్యలు పరిష్కరించాల్సిందే


అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తున్న కార్మికులు

అనంత నగరపాలిక, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు 15వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని పారిశుద్ధ్య పరంగా ఉన్న ఆరు సర్కిళ్లలో కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్వీ నాయుడు, కార్యదర్శి వెంకటనారాయణ, నాగరాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని