Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోన కన్వాశ్రమం అధిపతి స్వామి విష్ణుదాస్‌ శివైక్యం


స్వామి విష్ణుదాస్‌

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోన ఆశ్రమ అధిపతి స్వామి విష్ణుదాస్‌ (70) గురువారం తెల్లవారుజామున శివైక్యం చెందినట్లు ఆశ్రమ ముఖ్య కార్యనిర్వాహకుడు పోతన్న తెలిపారు. కొన్ని నెలలుగా స్వామి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈక్రమంలో శివైక్యం చెందారని చెప్పారు. భక్తుల సందర్శనార్థం స్వామి పార్థీవదేహాన్ని ఆయన గృహంలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచి ధ్యాన మందిరంలో సిద్ధి నిర్వహించారు. విష్ణుదాస్‌ 1975లో ఉత్తరాంచల్‌ రాష్ట్రం ఆల్‌మోడ్‌ ఆల్మండ జిల్లా సమగ్రామ నుంచి పుట్టపర్తి సత్యసాయి దర్శనార్థం వచ్చారు. అక్కడ కోన కన్వాశ్రమం గురించి తెలుసుకొని కోన చేరుకున్నారు. మాతృశ్రీ అంజనాదేవి వద్ద శిష్యరికం చేశారు. 1977లో ఆమె శివైక్యం చెందిన తర్వాత ఆశ్రమ అధిపతిగా కొనసాగుతూ ఆశ్రమ అభివృద్ధికి కృషిచేశారు. ఇక్కడ ఎన్నో వసతులు కల్పించారు. నిత్యాన్నదానం, గోశాల ఏర్పాటు చేశారు. ఏటా మహాశివరాత్రి, ఏకాదశి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేవారు. విషయం తెలుసుకున్న భక్తులు కడసారి దర్శనం కోసం జిల్లా నలమూలల నుంచి తరలివచ్చారు.

● స్వామి విష్ణుదాస్‌ శివైక్యం పొందడంతో మాజీ మంత్రి పరిటాల సునీత విచారం వ్యక్తం చేశారు. స్థానికుడు కాకపోయినా ఎక్కడో ఉత్తరాంచల్‌ నుంచి వచ్చి కోన ఆశ్రమ అభివృద్ధికి పాటు పడ్డారని ప్రశంసించారు. ఈ ప్రాంత భక్తులకు తీరనిలోటని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని