Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉపాధ్యాయుల ఉదారతరూ.2.77 లక్షల చెక్కును అందజేస్తున్న గుంతకల్లు ప్రాంతవాసులు

అనంత గ్రామీణం (తపోవనం), న్యూస్‌టుడే: ఎన్ని కష్టాలున్నా దాతృత్వంలో వెనుకంజ వేయమని నిరూపిస్తున్నారు జిల్లావాసులు. దానం స్వీకరించడమే కాదు... ఇవ్వడం కూడా నేర్చుకోవాలన్న ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ ఆశయాలను నెరవేరుస్తున్నారు. కరోనా రోగులకు ఆక్సిజన్‌, మెరుగైన సేవలు అందించడానికి జిల్లావాసులు కూడా విరాళాలు ఇవ్వాలని ఆర్డీటీ ఇచ్చిన పిలుపును ఎంతోమంది స్వీకరించారు. ఉద్యోగులు, రైతులు, కార్మికులు, వ్యాపారులు ఇలా అన్నివర్గాల ప్రజలు సాయం చేయడానికి మేము సైతం అంటున్నారు. గురువారం ఉపాధ్యాయ సంఘాలు రూ.10 లక్షలు అందించి ఉదారతను చాటుకున్నారు. ఉపాధ్యాయుల ఫెడరేషన్‌ నుంచి రూ.10 లక్షల చెక్కును ఆర్డీటీ పీడీ మాంచోఫెర్రర్‌ దంపతులకు అందజేశారు. పీఆర్‌టీయూఏపీ, ఎస్‌ఈఎస్‌టీయూ, ఏపీటీఎఫ్‌, ఎఫ్‌టీయూ, యూటీఎఫ్‌ సంఘాల సభ్యులు హాజరై చెక్కును అందజేశారు. అలాగే గుంతకల్లు ప్రాంతీయ పరిధిలోని రాగులపాడు, నాగసముద్రం, గుండాల తండా, పీకే చెరువు, దంచెర్ల, పొట్టిపాడు, వెంకటాంపల్లి గ్రామాల ప్రజలు మొత్తం రూ. 2.77,381 విశాలఫెర్రర్‌కు అందజేశారు. కేసీవీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు తరఫున ఎండీ సురేష్‌రెడ్డి రూ.2 లక్షలు సాయం అందించారు. అలాగే హెచ్‌ఆర్‌ నిర్మాణ సంస్థ రూ.లక్ష, అనంతపురానికి చెందిన కిశోర్‌కుమార్‌ రూ.25 వేలు, డాక్టర్‌ రమణ రూ.10 వేలు, ఫయాజుల్లా రూ.5 వేలు, ముదిగుబ్బ సచివాలయం తరఫున రూ.15 వేలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ఆర్డీటీ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

విశాలఫెర్రర్‌కు రూ.10 లక్షల విరాళం అందజేస్తున్న ఉపాధ్యాయులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని