Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెమ్‌డెసివిర్‌ అక్రమ విక్రేతల అరెస్టు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలో కరోనా రోగానికి వినియోగించే రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను వైద్య సిబ్బంది దొడ్డిదారిలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రోజురోజుకూ అక్రమదందా తారా స్థాయికి చేరుతోంది. ఒక్కో మందు సీసా(వయల్‌)ను రూ.15 వేల నుంచి రూ.30 వేలకు విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా నగరంలోని గఫూర్‌ ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బంది రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను అక్రమంగా విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమేష్‌రెడ్డి, ఒకటో పట్టణ సీఐ ప్రతాప్‌రెడ్డి సంయుక్తంగా గురువారం దాడులు చేశారు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు అబ్దుల్‌ రజాక్‌ గఫూర్‌ కుమారుడు కాసర్లకుంట మహమ్మద్‌అలీ, మరో వ్యక్తి కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పుప్పలదొడ్డి గ్రామానికి చెందిన కె.చంద్రశేఖర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు గఫూర్‌ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు. నిందితులు రెమ్‌డెసివిర్‌ వయల్‌ను ఒకొక్కటి రూ.25 వేలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి 9 వయల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని