Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ నలుగురు రాక.. యంత్రంతో అంత్యక్రియలు

గొయ్యి తవ్వుతున్న పొక్లెయిన్‌

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని ఎర్రమంచి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో గురువారం హిందూపురంలో మరణించాడు. కొవిడ్‌తో మరణించి ఉంటాడని బంధువులు అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు సోమశేఖర్‌ మానవతా దృక్పథంతో జేసీబీని పంపించి అంత్యక్రియలు నిర్వహించారు. బంధువుల వివరాల మేరకు కురుబవాండ్లపల్లికి చెందిన ఆంజనేయులు(60) కొంతకాలంగా హిందూపురం సమీపంలోని కొటిపి గ్రామంలో నివశిస్తున్నాడు. గురువారం ఉదయం అనారోగ్యంతో మరణించాడు. అతనికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమార్తెకు పెళ్లి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని