Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్షం.. భారీ నష్టం


పడిపోయిన విద్యుత్తుస్తంభం

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గంలో బుధవారం రాత్రి కురిసిన వర్షం, ఈదురుగాలులకు భారీనష్టం వాటిల్లింది. కంబదూరురోడ్డులో టమోటా మండీ షెడ్లు కూలిపోయాయి. కేఆర్‌ మండీకి సంబంధించి రూ.25 లక్షలు, కేకేఆర్‌ మండీకి సుమారు రూ.7 లక్షలు వరకు నష్టం వాటిల్లిందని యజమానులు తెలిపారు. మరోరెండు కూడా దెబ్బతిన్నాయి. మల్లాపురం రోడ్డులోని షెడ్‌ కూలి విద్యుత్తు స్తంభాలపై పడింది. రాత్రి సమయంలో ఎవరూ సంచరించకపోవడంతో ప్రాణంనష్టం వాటిల్లలేదు. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మున్సిపాలిటీ పరిధిలో కాలువలు పొంగాయి.

కళ్యాణదుర్గం గ్రామీణం: కుందుర్పి మండలం నాగేపల్లికి చెందిన సన్నకరియప్ప నాలుగెకరాల్లో సాగు చేసిన ఉల్లి పంట నీట మునిగింది. కోత దశలోనే ఇలా అయిందని సుమారు రూ.1.50 లక్షల వరకు నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెస్తరపల్లి, కళ్యాణదుర్గంలోని పలు గ్రామాల చెరువుల్లో వర్షపునీరు చేరింది.

27 మండలాల్లో వర్షం

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే : జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. రెండోరోజు బుధవారం రాత్రి జిల్లాలో పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెరువులు, కుంటలకు నీరు చేరింది. మొత్తం 27 మండలాల్లో వర్షం కురిసింది. మండలాల వారీగా పరిశీలిస్తే కుందుర్పి మండలంలో అత్యధికంగా 38.6 మి.మీ., పరిగిలో 2.0 మి.మీ. అత్యల్ప వర్షపాతం నమోదైంది. వజ్రకరూరులో 32.0, కళ్యాణదుర్గంలో 28.6, బెళుగుప్పలో 28.4, రాయదుర్గంలో 26.4, శెట్టూరులో 25.4, యల్లనూరులో 20.0, కరబదూరులో 18.6, లేపాక్షిలో 15.2, నల్లచెరువులో 10.2 తనకల్లులో 9.4, అమరాపురంలో 9.0, బ్రహ్మసముద్రంలో 7.2, అనంతపురంలో 5.8, హిందూపురంలో 5.2, తాడిపత్రిలో 5.0, ఉరవకొండ, మండకశిర మండలాల్లో 4.8 మి.మీ. చొప్పున, ఆత్మకూరులో 3.6, పుట్టపర్తి, చిలమత్తూరు మండలాల్లో 3.4 మి.మీలు చొప్పున, రాప్తాడులో 3.2, కూడేరులో 3.0, కొత్తచెరువులో 2.6, గోరంట్లలో 2.4, బుక్కపట్నంలో 2.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైందని ముఖ్య ప్రణాళికాధికారి ప్రేమచంద్ర తెలియజేశారు.


కళ్యాణదుర్గం: కుప్పకూలిన షెడ్లు

కళ్యాణదుర్గం గ్రామీణం: నాగేపల్లిలో నీటమునిగిన ఉల్లిపంట


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని