Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నదాతకు అండగా ఉంటాం


చెక్కు విడుదల చేస్తున్న మంత్రి శంకరనారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: అన్నదాతకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. రైతు భరోసా-పీఎం కిసాన్‌-2021-22 పథకాలకు సంబంధించిన సొమ్మును తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దూరశ్రవణ వీక్షణ సమావేశం ద్వారా విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ.. రైతుకు అండగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు. మూడో ఏడాది ఖరీఫ్‌ సాగు కోసం పెట్టుబడి సాయంగా రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకాల ద్వారా నేరుగా రైతు ఖాతాలకు సొమ్ము జమచేస్తామన్నారు. కలెక్టర్‌ గంధ చంద్రుడు మాట్లాడుతూ.. జిల్లాలో రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకాల ద్వారా 5,72,816 మంది రైతులకు రూ.429.62 కోట్లు రైతు ఖాతాలకు జమ చేస్తామన్నారు. అనంతరం రైతులను సీఎంతో మాట్లాడించారు. ఆ తర్వాత రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకాలకు సంబంధించిన సొమ్మును విడుదల చేశారు. ఈ వీసీలో ప్రభుత్వ విప్‌ కాపురామచంద్రారెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఉషశ్రీ, తిప్పేస్వామి, జేసీ నిశాంత్‌కుమార్‌, జేడీఏ రామకృష్ణ, ఎంఏవో వెకంటేశ్వరప్రసాద్‌, రైతులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని