Published : 14/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్చెల్సీ వాటా 25.755 టీఎంసీలు

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: జిల్లా వరప్రదాయినిగా భావిస్తున్న తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ (హెచ్చెల్సీ) వాటాగా 25.755 టీఎంసీలు కేటాయించారు. ఈ ఏడాది నీటి సీజన్‌లో తుంగభద్ర జలాశయానికి (టీబీ) 168 టీఎంసీలు లభ్యం అవుతాయని అంచనా వేశారు. ప్రస్తుత సీజన్‌లో టీబీ మండలి తొలి సమావేశం గురువారం జూమ్‌ ద్వారా జరిగింది. మండలి ఎస్‌ఈ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావే హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌ తన కార్యాలయం నుంచి పాల్గొన్నారు. కర్నూలు, ఆర్డీఎస్‌ ఎస్‌ఈలు కూడా హాజరయ్యారు. ముందస్తు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. అందుకే గతేడాది తరహాలోనే ఈదఫా కూడా 168 టీఎంసీలు లభ్యం అవుతాయని అంచనా వేశారు. ప్రోరేట్‌ ప్రకారం రాష్ట్రాల వాటాను నిర్ణయించారు. కర్ణాటకకు 110.143 టీఎంసీలు, ఆంధ్రకు 52.698, తెలంగాణకు 5.159 టీఎంసీల ప్రకారం కేటాయించారు. ఏపీ కోటాలో హెచ్చెల్సీకి 25.755 టీఎంసీలు రానున్నాయి. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో మొదలైంది. జూన్‌లో వర్షాలు ఎక్కువ వస్తాయని అంచనా వేశారు. జులై 20వ తేదీ నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. ఇందులో భాగంగా హెచ్చెల్సీకి కూడా జులై 20నే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎస్‌ఈ రాజశేఖర్‌ ధ్రువీకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని