293 మంది వీవీఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు
eenadu telugu news
Published : 24/10/2021 06:21 IST

293 మంది వీవీఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు


కొలువులు సాధించిన విజేతలతో యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు

పెదకాకాని, న్యూస్‌టుడే: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంటు నిర్వహించిన ఉద్యోగ నియామక ప్రక్రియలో తమ కళాశాలకు చెందిన 293 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని వీవీఐటీ కళాశాల ఛైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ తెలిపారు. సెప్టెంబరు మొదటి వారం నుంచి అక్టోబరు 10 వరకు అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఎంపికల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని ఆయన పేర్కొన్నారు. వీరిలో 181 మంది రూ.4 లక్షలు, 95 మంది రూ.5 లక్షలు, 17 మంది రూ.7 లక్షల వార్షిక వేతనంతో నియామకాలు పొందినట్టు ఆయన చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 622 మంది వీవీఐటీ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్టు ఆయన వివరించారు. అనంతరం ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.మల్లికార్జునరెడ్డి, డీన్‌ ఆఫ్‌ ఎకడమిక్స్‌ గిరిబాబు తదితరులు ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని