కొత్తిమీర కట్ట రూ.60
eenadu telugu news
Published : 24/10/2021 05:53 IST

కొత్తిమీర కట్ట రూ.60

 

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: పది రోజుల క్రితం వరకు రూ.10 పలికిన కొత్తిమీర కట్ట నేడు రూ.60 అయింది. స్థానికంగా పంట అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం జిల్లాకు బెంగళూరు, పరిసరాల నుంచి ఇది దిగుమతి అవుతోంది. సాధారణంగా 150 కట్టలు ఒక మోపుగా అక్కడి నుంచి చేరుతోంది. అయితే దూరాభారం నేపథ్యంలో వాటిలో దాదాపు 50 వరకు పాడైపోతున్నాయి. ఫలితంగా బాగున్న వాటికి వీటి ధర జత అవుతోంది. రవాణా ఖర్చులు కలిసి తడిసి మోపెడైంది. జిల్లాలో కుంచనపల్లి, కొలకలూరు, నందివెలుగు, ఎరుకలపూడి, గుడివాడ, సుద్దపల్లి ప్రాంతాల్లో కొత్తిమీర ఎక్కువగా సాగవుతోంది. వీటిలోనూ తొలి రెండు గ్రామాల నుంచే అధికంగా సరఫరా అవుతోంది. సాధారణంగా 45 నుంచి 50 రోజుల్లో ఈ పంట చేతికొస్తుంది. అయితే అధిక వర్షాల వల్ల ఈ ప్రాంతాల్లో పంట దెబ్బతింది. ఫలితంగా దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ధర పెరిగింది. మన ప్రాంతంలో ఇప్పడు వేసిన పంట నవంబరు 15 నాటికి చేతికొస్తుందని, అయితే ఈ నెలాఖరులో మరోమారు భారీ వర్షాలు ఉన్నాయని చెబుతున్నారని, అదే జరిగితే ఈ పంట కూడా చేతికి రాదని కొలకలూరు గ్రామానికి చెందిన రైతు వీరరాఘవయ్య ఆందోళన వ్యక్తంచేశారు. ఇతర రోజుల్లో ఎలాగోలా సర్దుకున్నా ఆదివారం మాంసాహారంలోకి ఖచ్చితంగా ఈ సువాసన ఇచ్చే ఆకులు ఉండాలని, అందుకే ధర ఎక్కువైనా కొనుగోలు చేయక తప్పడం లేదని కొందరు ‘న్యూస్‌టుడే’ వద్ద వాపోయారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని