శ్రీవారి ప్రసాదానికి వేకనూరు బియ్యం
eenadu telugu news
Published : 24/10/2021 05:13 IST

శ్రీవారి ప్రసాదానికి వేకనూరు బియ్యం


బియ్యం వాహనాన్ని ప్రారంభిస్తున్న సర్పంచి శ్రీలక్ష్మి, యువ రైతులు

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ప్రసాదం తయారీ కోసం అవనిగడ్డ మండలం వేకనూరులోని యువ రైతులు దేశవాళీ విత్తనాలతో సహజ సిద్ధంగా పండించిన బియ్యం బస్తాలను శనివారం ప్రత్యేక వాహనంలో తిరుమలకు పంపారు. యువ రైతులు మాదివాడ సురేంద్ర, భరద్వాజ్‌, శివబాలకృష్ణ, వేణు, మురళీకృష్ణ తదితరులు నారాయణ కామిలి, కాలాబట్టు రకాల బియ్యంతో స్థానిక సంతాన వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 4 టన్నుల బియ్యంతో తిరుమలకు వెళ్లే ప్రత్యేక వాహనాన్ని సర్పంచి తుంగల శ్రీలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. వెంకటేశ్వరుడి ప్రసాదానికి తమ పంట వినియోగించడం అదృష్ణంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని