సమర్థంగా సంపూర్ణ గృహ హక్కు సర్వే
eenadu telugu news
Published : 24/10/2021 05:13 IST

సమర్థంగా సంపూర్ణ గృహ హక్కు సర్వే


మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌, జేసీలు శ్రీవాస్‌ నుపూర్‌, శివశంకర్‌, పీడీ రామచంద్రన్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు సర్వేను సమర్థంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి శనివారం రాత్రి వీసీ నిర్వహించారు. 1983 నుంచి 2011 వరకు గృహాలు పొందిన లబ్ధిదారుల జాబితాలు ఉన్నట్టు తెలిపారు. ఆ గృహాలు, పట్టాలు ఎవరికి మంజూరు అయ్యాయి, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయో? తెలుసుకోవాలన్నారు. వాటిల్లో మొదటి లబ్ధిదారుడు కాకుండా, ఇతరులు ఉంటే ప్రభుత్వం సూచించిన ధరకు రెట్టింపు వసూలు చేయాలన్నారు. వాలంటీర్లు క్లస్టర్లలో సందర్శించి, గృహాల్లో నివసిస్తున్న వారి వివరాలు సేకరించాలని చెప్పారు. జేసీలు ఎల్‌.శివశంకర్‌, శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, గృహ నిర్మాణ సంస్థ పీడీ రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖరీఫ్‌లో సమస్యలు లేకుండా చూడండి

జిల్లా వ్యవసాయ సలహా బోర్డు సమావేశాన్ని శనివారం వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. సలహా బోర్డు ఛైర్మన్‌ జన్ను రాఘవరావు మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సహాయ చర్యలు అందేలా చూడాలన్నారు. జేసీ కె.మాధవీలత మాట్లాడుతూ.. ఎరువులు, క్రిమి సంహార మందుల కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. జేడీఏ టి.మోహన్‌రావు, ఏడీఏ మణిధర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని