27న విజయవాడలో ఆంధ్రా విజ్ఞానోత్సవం
eenadu telugu news
Published : 24/10/2021 05:13 IST

27న విజయవాడలో ఆంధ్రా విజ్ఞానోత్సవం


లోగో ఆవిష్కరిస్తున్న విజయబాబు, గోళ్ల నారాయణరావు, కృష్ణంరాజు తదితరులు

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : సామాజిక, రాజకీయ చైతన్యానికి చర్చా కార్యక్రమాలతో కూడిన విజ్ఞానోత్సవాలు దోహదపడతాయని స.హ చట్టం మాజీ కమిషనర్‌ పి.విజయబాబు అన్నారు. శనివారం స్థానిక ఓ హోటల్‌లో ఈ నెల 27న విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ఆంధ్రా విజ్ఞానోత్సవం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఉత్సవాలకు అతిథులుగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, తెలుగు, సాంస్కృతిక అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి, సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ, ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పూనూరు గౌతమ్‌రెడ్డి, ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటారని వివరించారు. ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. అధికార విభజన, న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య విబేధాలు, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలుగు భాష, ఆంధ్రా సంస్కృతి, భవిష్యత్తు అనే అంశాలపై చర్చా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.వి.ఆర్‌.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని