వివాహితపై అత్యాచారం?
eenadu telugu news
Updated : 24/10/2021 06:30 IST

వివాహితపై అత్యాచారం?

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: వివాహితపై వరుసకు బంధువు అయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై శనివారం వీరవల్లి షేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 18న సాయంత్రం ఆగిరిపల్లి మండలం ఈదులగూడెంకు చెందిన ఆమెను.. వరుసకు బంధువు అయ్యే వ్యక్తి బలవంతంగా బాపులపాడు మండలం మల్లవల్లి పరిధిలోని మామిడి తోటల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం నూజివీడు ఆసుపత్రికి తరలించారు.నిందితుడ్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎస్సై తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని