చిత్ర వార్తలు
eenadu telugu news
Updated : 24/10/2021 06:23 IST

చిత్ర వార్తలు

కనిపిస్తే.. కరోనా టీకా

 

కరోనా టీకా వేసే కార్యక్రమం ఎంత ముమ్మరంగా సాగుతుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఎవరు ఎక్కడ కనిపిస్తే అక్కడే టీకా వేసేస్తున్నారు. పులిగడ్డలో పశువులకు మేత కోసుకువచ్చే వెంకటేశ్వరరావును రోడ్డుపైనే ఆపి ఆరోగ్య కార్యకర్త టీకా వేశారు.

- న్యూస్‌టుడే, అవనిగడ్డ గ్రామీణం


తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు మూలన..!

 

విజయవాడ ప్రభుత్వ పాత ఆసుపత్రిలో బాలింతలు, శిశువులను ఇంటికి తీసుకెళ్లే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ఇవి. వీటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో తుప్పు పడుతున్నాయి.. వినియోగంలోకి తీసుకువస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

- ఈనాడు, అమరావతి


ఆకలేస్తే అన్నం లేదు..

శుభకార్యాలలో మిగిలిన భోజనాన్ని వృథా చేయకుండా పేదవారికి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో గుంటూరు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో ఫుడ్‌బ్యాంకులను ఏర్పాటు చేశారు లాడ్జి సెంటర్‌లో ఉన్న ఫుడ్‌ బ్యాంక్‌ పర్యవేక్షణ లేక చతికిలపడింది. నిరాశ్రయులకు షెల్టర్‌లా మారుతోంది.. నగరపాలక సంస్థ, కల్యాణ మండపాల నిర్వాహకులు, హోటల్స్‌ యజమానులు దృష్టిసారిస్తే అన్నార్తుల కడుపు నిండుతుంది.

- ఈనాడు గుంటూరు


గుంటూరు నగరపాలకసంస్థ వద్ద వైకాపా జనాగ్రహ దీక్ష చేస్తున్న వారికి శనివారం నిమ్మరసం ఇచ్చి విరమింపజేస్తున్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు తదితరులు


ఆనంద వేడుక

 

అట్లతద్ది పండగ అంటే మహిళలకు సందడే సందడి.. చేతులకు గోరింటాకు పెట్టుకొని, ఊయల ఊగేందుకు ఉత్సాహం చూపిస్తారు. బాలికలు ఉప్పులకుప్ప వయ్యారి భామ.. అంటూ ఆటలాడతారు. శనివారం సత్తెనపల్లి ప్రగతి పాఠశాలలో నిర్వహించిన పండగలో విద్యార్థినులు, ఉపాధ్యాయినులు ఉత్సాహంగా ఆడిపాడారు.

- సత్తెనపల్లి, న్యూస్‌టుడే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని