అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
eenadu telugu news
Published : 15/10/2021 05:24 IST

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

కృష్ణలంక, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన రాణిగారితోట పరిధిలోని 17వ డివిజన్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... భవానీపురం లేబర్‌ కాలనీకి చెందిన మగిపతి బాల భవానీ(24)కి గొట్టిపర్తి రమణతో వివాహం జరగ్గా వారు రాణిగారితోట శాంపిల్‌ భవనం వద్ద ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. జీవనోపాధిలో భాగంగా రమణ బండిపై ఐస్‌లు విక్రయిస్తుంటాడు. వివాహం జరిగిన కొద్దిరోజుల అనంతరం తాను అప్పుల పాలైనందున పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాల్సిందిగా భార్యను తరుచుగా వేధించాడు. దీంతో భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అప్పులు తానే తీర్చుకుంటానని భర్త హామీ ఇవ్వడంతో మూడు నెలల క్రితం పిల్లలతో భర్త వద్దకు చేరుకుంది. పుట్టింటి నుంచి రూ.లక్ష తేవాలని భర్త వేధించడంతో ఆమె మనస్తాపానికి లోనైంది. గురువారం ఉదయం 7గంటల సమయంలో పిల్ల్లలు ఏడుస్తుండడాన్ని గమనించి ఇంటి యజమాని వచ్చి చూడగా గదిలోని ఫ్యాను కొక్కేనికి చీరతో ఉరివేసుకుని వేలాడుతూ భవానీ కనిపించింది. ఆమె తల్లి పార్వతికి ఫోన్‌ చేసి సమాచారం అందించారు. తన కుమార్తె మరణానికి అల్లుడి వేధింపులే కారణమని మృతురాలి తల్లి కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని