యువకుడి దారుణ హత్య
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

యువకుడి దారుణ హత్య

హరి కృష్ణ (పాత చిత్రం)

కోడూరు(అవనిగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: పాత కక్షల నేపథ్యంలో యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన కోడూరులో  గురువారం చోటుచేసుకుందని అవనిగడ్డ సీఐ బి.బి.రవికుమార్‌ చెప్పారు. కోడూరు ఒకటో వార్డుకు చెందిన శ్రావణం హరికృష్ణ (35)కు చెందిన భూమి నుంచి కొద్ది రోజుల కిందట వారి సమీప బంధువైన చందన వెంకటేశ్వరరావు అతని అనుచరులు మట్టి తరలించారు. హరికృష్ణ, వెంకటేశ్వరరావు వరుసకు బావా బావమరుదులు. రెండు కుటుంబాల మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పొలంలో గడ్డి కోసుకొచ్చేందుకు హరికృష్ణ నరసింహపురం సమీపంలోని పొలానికి వెళ్లాడు. ఒంటరిగా గడ్డి కోసుకుంటున్న హరికృష్ణతో వెంకటేశ్వరరావు వాగ్వాదానికి దిగి తన వద్ద ఉన్న కత్తితో హరికృష్ణపై దాడి చేసి గాయపర్చాడని సీఐ తెలిపారు. తీవ్రంగా గాయపడిన హరికృష్ణను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుని తండ్రి రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్‌ తెలిపారు. హరికృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. నిందితుడు వెంకటేశ్వరరావు పరారిలో ఉన్నాడని సీఐ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని