ఉత్సాహంగా దసరా క్రీడోత్సవాలు
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

ఉత్సాహంగా దసరా క్రీడోత్సవాలు

ఫుట్‌బాల్‌ జట్టుకు నగదు పారితోషికాలు అందిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌, డీఎస్‌ఏ సీఈవో శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పెనుమత్స శిరీష, కుక్కల అనిత

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన దసరా క్రీడోత్సవాల్లో పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా తలపడ్డారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ముఖ్య అతిథిగా హాజరై తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు నగదు పారితోషికాలు అందించారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ సీఈవో యు.శ్రీనివాసరావు, డీఎస్‌ఏ విశ్రాంత డీఎస్‌డీవో బి.సుధాకర్‌, కార్పొరేటర్లు కుక్కల అనిత, పెనుమత్స శిరీష అతిథులుగా హాజరుకాగా.. డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ బి.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి
బీ వాలీబాల్‌ బాలుర విభాగంలో ఎన్‌బీపీ ట్రస్ట్‌ జట్టు ప్రథమ, కైకలూరు జట్టు ద్వితీయ, బాలికల విభాగంలో ఎన్‌బీపీ ట్రస్ట్‌ ప్రథమ, ఎస్‌డీఎంఎస్‌ఎంకే జట్టు ద్వితీయ, హ్యాండ్‌బాల్‌ బాలుర విభాగంలో డి.ఉదేశ్వరరావు స్మారక జట్టు ప్రథమ, పి.సత్యనారాయణ జట్టు ద్వితీయ, ఫుట్‌బాల్‌ బాలుర విభాగంలో డీఎస్‌ఏ కృష్ణా-1 ప్రథమ, హీల్‌ ఫుట్‌బాల్‌ జట్టు ద్వితీయ, టెన్నిస్‌ బాలుర సింగిల్స్‌లో వై.ఇషాన్‌, వి.ఆనంద్‌, బాలికల విభాగంలో ఎస్‌.యశస్వి, పి.యుతిక, బ్యాడ్మింటన్‌ బాలుర సింగిల్స్‌లో టి.హర్షన్‌, కె.యువతేజ్‌, బాలికల విభాగంలో టి.సూర్యచరిష్మ, బీఆర్‌ సాయి వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని