వెండితెర.. మళ్లీ మిలమిల
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

వెండితెర.. మళ్లీ మిలమిల

ఈటీవీ-గుంటూరు

ఎన్నాళ్లో వేచిన సమయమంటూ సినిమా థియేటర్లు మళ్లీ సందడి చేశాయి. కరోనా సంక్షోభంతో ఏడాదిన్నరగా ఆహ్లాదం కరవయ్యింది. కొన్నాళ్లు కొవిడ్‌ నిబంధనల ప్రకారం సీట్లు సర్దుబాటు చేసి సినిమాలు నడిపిసిస్తే.. మరికొన్ని ఓటీటీ వేదికగా వినోదం పంచాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో థియేటర్లలో మళ్లీ సినీసందడి బయలుదేరింది. సినిమా థియేటర్లపై ఆధారపడి జీనిస్తున్న బడుగుల జీవితాల్లో సందడి నెలకొంది. పూర్తి కెపాసిటీ సామర్థ్యంతో సినిమాలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చాలా రోజుల నుంచి ఇంటికే పరిమితమైన విద్యార్థులు, మహిళలు, చిన్నారులు తొలిరోజు థియేటర్లకు తరలివచ్చారు. గుంటూరులో అనుబంధ థియేటర్లతో కలుపుకుని 50 వరకు ఉండగా కొన్ని పూర్తిగా... మరికొన్ని సగం టికెట్‌ కెపాసిటీతో నడిచాయి. అందరికీ సమాచారం తెలిసిన తర్వాత థియేటర్లు కళకళలాడటం ఖాయమని యువజనులు అంటున్నారు.

విద్యుత్‌ ఛార్జీలతోపాటు టిక్కెట్‌ పై ప్రస్తుతం వివిధ ప్రైవేటు సంస్థలు ఇస్తున్న రాయితీలు పెంచితే సినిమా థియేటర్లు మనుగడ సాగించడం సాధ్యమవుతుందని ఓ సినిమా థియేటర్‌ నిర్వాహకుడు చెప్పారు. ఏది ఏమైనా ప్రేక్షకులకు వినోదం పంచే థియేటర్లు మళ్లీ పూర్తిగా తెరుచుకోవడం అన్నివర్గాలల్లోనూ ఆనందాన్ని నింపుతోంది. ప్రభుత్వం సైతం సినిమా రంగాన్ని ఆదుకునేలా చర్యలు చేపట్టాలని ఆయావర్గాల ప్రతినిధులు కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని