ఎంత పెద్ద బెండ మొక్కో!
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

ఎంత పెద్ద బెండ మొక్కో!

ఈటీవీ, గుంటూరు

అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన రైతు తొర్లికుంట కన్నయ్య పెరట్లో ఎర్రబెండ ఏపుగా పెరిగింది. బెండ మొక్కలు సాధారణంగా 4 నుంచి 5 అడుగుల వరకూ ఉంటాయి. కన్నయ్య పెరట్లో బెండ మొక్క ఏకంగా 9.5 అడుగులు పెరిగింది. 20 విత్తనాలు నాటగా 4 మొక్కలు మాత్రం ఎత్తుగా పెరిగ్గా, అందులో ఓ మొక్క అన్నింటికన్నా ఎత్తుకు ఎదిగింది. కొన్ని కాయలను ఇంటికి వాడుకోగా, మిగతావి విత్తనాలకు ఉంచానని రైతు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని