కలల పంటలు.. కన్నీళ్లే మిగిల్చాయి..
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

కలల పంటలు.. కన్నీళ్లే మిగిల్చాయి..

కావ్యశ్రీ మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు

కైకలూరు : దసరా పండుగను అమ్మమ్మ ఇంటి వద్ద జరుపుకొనేందుకు ఎంతో ఉత్సాహంగా వచ్చిన చిన్నారులు గంటల వ్యవధిలోనే విగతజీవులుగా మారడంతో వరహాపట్నం, సీతనపల్లి, అల్లూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కట్టా వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె సృజినిని మండలంలోని సీతనపల్లికి చెందిన వీరగాని వెంకటకృష్ణారావుకు, రెండో కుమార్తె నాగలక్ష్మిని ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామానికి చెందిన మిఠాయి దుకాణం నిర్వాహకుడు లుక్కా నాగశివకు ఇచ్చి పెళ్లి చేశారు. పెద్ద కుమార్తె పిల్లలు కావ్యశ్రీ (11), నవ్యశ్రీ(10) దొడ్డిపట్ల హైస్కూల్‌లో 7, 6 తరగతులు చదివేవారు. కుమారుడు అయ్యప్ప ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థి నాగలక్ష్మి పిల్లలు లుక్కా నిఖిత (10), లుక్కా వీరాంజనేయులు(6) ప్రాథమిక పాఠశాలలో 4, 2 తరగతులు చదివేవారు. దసరా సెలవులు పురస్కరించుకుని వీరంతా గురువారం మధ్యాహ్నం వరహాపట్నం వచ్చారు. పిల్లల తల్లిదండ్రులు వారిని అమ్మమ్మ వద్ద వదిలి కొత్త దుస్తులు కొనుగోలు చేసేందుకు కైకలూరు వెళ్లారు. ఇంతలోనే నలుగురు చిన్నారులు చెరువులో దిగి ప్రాణాలొదిలారు. ముగ్గురు మనవరాళ్లు, ఓ మనవడిని పోగొట్టుకున్న వెంకటేశ్వరమ్మ రోదన మిన్నంటింది. పెద్ద కుమార్తె సంతానంలో అయ్యప్ప చెరువులో దిగకపోవడంతో ప్రాణాలతో మిగిలాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని