సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి..
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి..

స్వర్ణకారుడి మృతి


సుబ్బారావు మృతదేహం

మోతుగూడెం, న్యూస్‌టుడే: తూర్పు గోదావరి జిల్లా మన్యంలోని చింతూరు సర్కిల్‌ మోతుగూడెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పొల్లూరు జలపాతం వద్ద గురువారం సాయంత్రం విజయవాడకు చెందిన తిరుమలశెట్టి సుబ్బారావు మృతిచెందారు. విజయవాడలోని ఓ జ్యులరీ సంస్థకు చెందిన ఎనిమిమంది ఉద్యోగులు విహార యాత్రలో భాగంగా గురువారం మధ్యాహ్నం కారులో పొల్లూరు జలపాతానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో స్వీయ చిత్రాలు తీసుకుంటున్న సమయంలో సుబ్బారావు(35) ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతిచెందారు. సహచరులు అతన్ని మోతుగూడెం జెన్‌కో భవ్య హెల్త్‌కేర్‌ కేంద్రానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యాధికారి తెలిపారు. ఘటనపై మోతుగూడెం ఏఎస్సై పట్టాభిరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని