అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

బస్సు కింది భాగంలో ద్విచక్ర వాహనం

కృష్ణలంక, న్యూస్‌టుడే: డ్రైవర్‌ నిర్లక్ష్యంతో అదుపుతప్పిన బస్సు ప్రయాణికులపైకి దూసుకొచ్చిన సంఘటన గురువారం వారధి పరిసరాల్లో చోటుచేసుకుంది. చీరాల డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో విజయవాడ నుంచి చీరాల వెళుతూ వారధి సమీపంలోని గుంటూరు బస్టాపునకు చేరుకుంది. డ్రైవర్‌ ప్రవీణ్‌కుమార్‌ బస్సును నిలిపి ప్రయాణికులకు టిక్కెట్లను విక్రయిస్తున్నారు. ఉన్నట్టుండి బస్సు అదుపు తప్పి వెనుకకు మళ్లింది. అక్కడే ద్విచక్ర వాహనంపై కూర్చున్న వ్యక్తి గమనించి వాహనాన్ని వదిలేసి పక్కకు పరిగెత్తాడు. బస్సు కింద ద్విచక్రవాహనం ఇరుక్కుపోయింది. అనంతరం వెనుక ఉన్న మరో వాహనాన్ని ఢీకొట్టి బస్సు ఆగింది. ఈ సమయంలో బస్టాపులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని