‘సినిమా టిక్కెట్లపై మంత్రి ప్రకటన గందరగోళం’
eenadu telugu news
Updated : 17/09/2021 11:33 IST

‘సినిమా టిక్కెట్లపై మంత్రి ప్రకటన గందరగోళం’

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : సినిమా టిక్కెట్ల విక్రయాలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదని, దీనిపై కమిటీ వేశామంటూ మంత్రి పేర్ని వెంకట్రామయ్య చేసిన ప్రకటన చిత్ర పరిశ్రమను గందరగోళంలోకి నెట్టిందని తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఏపీ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఏపీ ఫిల్మ్‌ అభివృద్ధి నిర్వహణలో విక్రయించేందుకు జీవో నెంబరు 35 విడుదల చేసిందన్నారు. దీనిపై ఒక బ్లూ ప్రింట్‌ విడుదల చేసేందుకు కమిటీని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల మంత్రి పేర్ని వెంకట్రామయ్య.. టిక్కెట్ల అమ్మకాలపై నిర్ణయం తీసుకోలేదని చేసిన ప్రకటనకు, ప్రభుత్వ జీవోకు పొంతన లేదన్నారు. నిర్వహణ తదితర అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఛైర్మన్‌తో పాటు సభ్యులను నియమించిన తర్వాత మంత్రి చేసిన ప్రకటన చిత్రపరిశ్రమను గందరగోళానికి గురిచేసిందన్నారు. ప్రభుత్వ పోర్టల్‌లో మాత్రమే టిక్కెట్లు విక్రయించాలన్న నిర్ణయం, సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని తెలిపారు. మంత్రి చేసిన ప్రకటనను మార్చుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని