జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌కు రైల్వే అథ్లెట్లు
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌కు రైల్వే అథ్లెట్లు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: బెజవాడ డివిజన్‌కు చెందిన ముగ్గురు అథ్లెట్లు వరంగల్‌లో ఈ నెల 19వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత రైల్వేస్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్పోర్ట్స్‌) ఎన్‌.అర్జునరావు తెలిపారు. జి.కార్తిక లాంగ్‌ జంప్‌, ఎం.సౌమియ హెప్టాథ్లాన్‌, ప్రీతి లంబా 3000మీ.ల స్టీపుల్‌ఛేజ్‌ ఈవెంట్లలో తలపడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం షివేంద్ర మోహన్‌, ఏడీఆర్‌ఎంలు డి.శ్రీనివాసరావు, ఎం.శ్రీకాంత్‌, డివిజనల్‌ స్పోర్ట్స్‌ అధికారి వల్లేశ్వర బి.తోకల తదితరులు అథ్లెట్లను అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని