ఓపెన్‌ అథ్లెటిక్స్‌లో ఏఎన్‌యూ విద్యార్థి సత్తా
eenadu telugu news
Published : 17/09/2021 04:04 IST

ఓపెన్‌ అథ్లెటిక్స్‌లో ఏఎన్‌యూ విద్యార్థి సత్తా


రికార్డు నెలకొల్పిన నరేష్‌

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: తెలంగాణలోని హన్మకొండలో జరుగుతున్న 60వ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని రేపల్లె సాధన డిగ్రీ కళాశాల విద్యార్థి నరేష్‌కుమార్‌ ‘న్యూ మీట్‌’ రికార్డు నెలకొల్పాడు. వంద మీటర్ల పరుగుపందేన్ని 10.30 సెకన్లలో పూర్తిచేసి కొత్త రికార్డు సాధించాడు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్‌ నరేష్‌కు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో ఏఎన్‌యూ పేరును నిలిపినందుకు శుభాకాంక్షలు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని