భారీగా తెలంగాణ మద్యం పట్టివేత
eenadu telugu news
Published : 30/07/2021 04:18 IST

భారీగా తెలంగాణ మద్యం పట్టివేత


స్వాధీనం చేసుకున్న సీసాలతో అదనపు ఎస్పీ సత్తిబాబు, సీఐలు

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: అక్రమ మద్యం, గంజాయి నిల్వలతో పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ మోకా సత్తిబాబు హెచ్చరించారు. రామవరప్పాడులో సాయినగర్‌కు చెందిన కలపాల స్వాతి, చీపురపల్లి ప్రేమ్‌ల వద్ద రూ.2.15 లక్షల విలువైన 805 సీసాల తెలంగాణ మద్యాన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సరకును సీజ్‌ చేశారు. దీనిపై గురునానక్‌ కాలనీలోని ఎస్‌ఈబీ స్టేషన్‌లో సత్తిబాబు మాట్లాడుతూ తమ పరిధిలోని పటమట, విజయవాడ ఈస్ట్‌, వెస్ట్‌, గన్నవరం, భవానీపురం, ఉయ్యూరు ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో పెద్దమొత్తంగా మద్యం, గుట్కా, గంజాయి పట్టుకున్నామన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలతో పట్టుబడిన యువతను మంచి నడవడిక అందించే ఉద్దేశంతో రీహాబిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో నేరాలతో పట్టుబడిన వారికి స్టేషన్‌ బెయిల్‌ వచ్చేదని, కొత్త నిబంధనలతో రిమాండ్‌ విధించడంతో పాటుగా రౌడీషీట్స్‌ కూడా ఓపెన్‌ చేసే అవకాశముందని హెచ్చరించారు. యువత అక్రమాలకు పాల్పడవద్దని సూచించారు. సీఐలు ఎన్‌.నిక్సన్‌, కె.వి.సుధాకర్‌, ఎస్‌ఐ రవి ప్రసాద్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు శ్రీనుబాబు, మురళి ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని