అల్లుడి చేతిలో మామ హత్య
eenadu telugu news
Published : 30/07/2021 04:16 IST

అల్లుడి చేతిలో మామ హత్య


సుబ్రహ్మణ్యం మృతదేహం

కోడూరు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడి చేతిలో మామ హత్యకు గురైన ఘటన కోడూరులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.నాగరాజు వివరాల ప్రకారం.. కోడూరు 10వ వార్డుకు చెందిన నరహరశెట్టి సుబ్రహ్మణ్యం, సావిత్రికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె కృష్ణకుమారిని కోడూరుకు చెందిన ముత్తిరెడ్డి నాగరత్తయ్యకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి పుట్టుకతోనే అంగవైకల్యం ఏర్పడింది. ప్రసవానికి వెళ్లినప్పుడు భార్యకు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించి సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్లే తన బిడ్డకు పోలియో సోకిదంటూ నాగరత్తయ్య అత్తమామలను నిందిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న బుధవారం కోడూరులో బంధువుల ఇంటి వద్ద అత్తమామలు, అల్లుడి మధ్య వాగ్వాదం ఏర్పడి ఘర్షణకు దారితీసింది. బంధువులు సర్దిచెప్పి వారిని పంపించారు. తర్వాత అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో కోడూరులోని ఓ దుకాణం వద్ద మామ అల్లుడు తారసపడటంతో ఘర్షణ పడ్డారు. అల్లుడు మామపై దాడి చేసి గాయపర్చాడు. తీవ్ర గాయాలైన సుబ్రహ్మణ్యం(64) ఇంటికి వెళ్లి తన భార్య సావిత్రితో జరిగిన విషయాన్ని చెప్పి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జరిగిన ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అవనిగడ్డ సీఐ బీబీ రవికుమార్‌ కోడూరు వచ్చి దాడి జరిగిన తీరును పరిశీలించారు.

*● ఇదే ఘటనను పురస్కరించుకొని తన పెదనాన్న సుబ్రహ్మణ్యం మృతికి కారణం నువ్వేనంటూ నాగరత్తయ్యపై అతడి బావమరిది నరహరశెట్టి సుధాకర్‌ ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. నాగరత్తయ్య ఫిర్యాదు మేరకు సుధాకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని