Published : 22/04/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందాల అతిథి

ముదరజిత్తు

గ, ఆడపక్షులు వేర్వేరు రంగుల్లో కనిపించే ముదర జిత్తు (పర్పుల్‌ రాపిడ్‌) భారత ఉపఖండానికి చెందిన పక్షి. ఇది కేవలం పది సెం.మీ. పొడవు ఉంటుంది. ఆడ, మగ పక్షులు రెండింటి పైభాగంలో తెలుపు, బూడిద మిళిత వర్ణంలో ఉన్నప్పటికీ.. మగపక్షి ఛాతీపై సన్నటి తిలకం రంగు పట్టీ కనిపిస్తుంది. ఆడపక్షి గొంతు వద్ద తెల్లగా ఉంటూ.. అక్కడి నుంచి కిందకు పసుపు వర్ణంలో ఉంటుంది. దక్షిణ భారత్‌లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచంలో మిగిలిన ఏ ప్రాంతంలోనూ ఉండవు. ఆహారంగా మకరందాన్ని తీసుకుంటాయి. అది లభించని పరిస్థితుల్లో చిన్న పురుగులను తింటాయి. మార్చి నుంచి జూన్‌ వరకూ పచ్చటి రంగుపై నల్లటి మచ్చలుండే గుడ్లు పెట్టి 14 నుంచి 17 రోజుల్లో పొదిగి సంతానోత్పత్తి చేస్తాయి. కొల్లేరులో దాదాపు ఏడు వేల వరకూ ఉన్నాయని అధికారులు చెప్పారు.

- కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని