Published : 22/04/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోరంకిలో తల్లీ కొడుకుల మృతి

పోరంకి, న్యూస్‌టుడే: పెనమలూరు మండలం పోరంకిలో కొవిడ్‌ బారిన పడి ఒకే కుటుంబంలో తల్లి(55), పెద్ద కొడుకు(35) మంగళవారం మృతి చెందారు. తల్లి ఇంటి వద్దే చనిపోగా.. పెద్ద కుమారుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయారు. ఆమెకు ముగ్గురు కుమారులు కాగా.. రెండో కుమారుడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మూడో కొడుకు కోలుకుంటున్నాడు. కొవిడ్‌ మరణాలకు భయపడి తూముల సెంటర్‌ ప్రాంతంలో పలువురు నివాసితులు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. నారాయణపురం కాలనీలో ఓ వ్యక్తి(52)కి వైరస్‌ సోకితే రోగి ఉంటున్న ఫ్లాటుకు అపార్ట్‌మెంటు వాసులు తాళం వేసి ఆ కుటుంబంలోని వ్యక్తులను బయటకు రానివ్వడం లేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని