Published : 22/04/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రాణవాయువే ఆధారం...

కరోనా రోగులకు అత్యవసరం
ఈనాడు, అమరావతి

కొత్తాసుపత్రి ప్రాంగణంలో ఆక్సిజన్‌ ప్లాంటు

జిల్లాలో రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 74 మంది వెంటిలేటర్‌ సహాయంతో కరోనా చికిత్స పొందుతున్నారు. ఐసీయూ(ఇంటిన్సెవ్‌ కేర్‌ యూనిట్‌) విభాగంలో 250 మంది ఉన్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంత మంది అనేది లెక్కకు రావడం లేదు. ఈ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులకు ప్రాణవాయువే కీలకం. జిల్లాలో ప్రస్తుతం ప్రాణవాయువు కొరత లేకున్నా రోగుల సంఖ్య పెరిగితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఏజెన్సీలు ఇప్పటికే ఇష్టానుసారంగా ధరలు పెంచి అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో వీటికి అదనంగా వసూలు చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మహారాష్ట్రలో జరిగిన ఘటనల నేపథ్యంలో ప్రాణవాయువు నిలువ చేసే సిలిండర్లు, క్రయోజనిక్‌ ట్యాంకర్ల భద్రతను అధికారులు సమీక్షిస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇది..!
జిల్లాకు ద్రవరూపంలో ఉండే ప్రాణవాయువు క్రయోజనిక్‌ ట్యాంకర్ల ద్వారా ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి. విశాఖపట్నం నుంచి దీన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద సిలిండర్లలో నిలువ చేసి అక్కడి నుంచి క్రిటికల్‌ యూనిట్లకు పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు సిలిండర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. కొవిడ్‌ వైరస్‌ సోగిన రోగికి ఆక్సిజన్‌ స్థాయి ముఖ్యం. తరచూ స్థాయిలు గుర్తించాల్సి ఉంటుంది. 90లోపు ఉంటే తప్పని సరిగా ఆక్సిజన్‌ అందించాల్సి ఉంటుంది. ఐసీయూలో ఉన్న రోగులకు అందరికి ప్రాణవాయువు అందిస్తున్నారు. ఇక వెంటిలేటర్లపై ఉన్న వారు సరేసరి. ఈ నెల ఇప్పటి వరకు 38 మంది రోగులు ప్రాణాలు వదిలారు. వీటిలో ఎక్కువ శాతం శ్వాస సంబంధమైన కారణాలతోనే ప్రాణాలు విడిచారనేది వైద్యులు చెబుతున్న అంశం.
కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో 30 కిలోలీటర్ల ప్రాణవాయువు నిలువ చేసే సామర్థ్యం ఉంది. ఆసుపత్రి ముందు భాగంలోనే క్రయోజనిక్‌ ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. వీటి నుంచి పైపుల ద్వారా ఇంటెన్సివ్‌ యూనిట్‌కు అందిస్తారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణలు ఉన్నారు. ఆసుపత్రి ముందుభాగంలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం జరిగితే నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి రెండు రోజులకు ఆక్సిజన్‌ ట్యాంకర్లు వస్తున్నాయి. రెండు, మూడు రోజులు సరిపడే నిల్వలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రోగులను బట్టి వినియోగం ఉంటుంది.i ఏరియా ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అందుబాటులో లేదు. దీనిపై అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బుధవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల కేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో అత్యవసరమైతే కనీసం నిలువలు లేవు. ప్రైవేటు అంబులెన్సుల్లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని